సాధారణంగా సినిమాలో వచ్చే హీరోయిన్లు తక్కువ వ్యవధిలోనే ఎక్కువగా పాపులర్ కావాలనుకుంటారు.  గతంలో హీరోయిన్లు కట్టుబొట్టుతో అందమైన హావభావాలతో ప్రేక్షకులను అలరించే వారు.  కానీ ఇటీవల కాలంలో వస్తున్న హీరోయిన్లు నటనకన్నా స్కిన్ షోతోనే ఎక్కువగా ఆకర్షిస్తున్నారు..దాంతో తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.  అయితే టాలీవుడ్ లో మాత్రం ఇలా స్కిన్ షో చేస్తే ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆ సినిమాలో బరితెగించిన నటించిందని..కుటుంబ సభ్యులు కూర్చొని సినిమా చూసే పరిస్థితుల్లో లేరని అంటారు. 

అయినా కూడా ఈ మద్య కొన్ని సినిమాలు అశ్లీలతనే ఎక్కువగా చూపిస్తున్నారు.  లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లు కామన్ అయ్యాయి.  కాకపోతే కొంత మంది హీరోయిన్లు టాలీవుడ్ లో మంచి పేరు రాగానే బాలీవుడ్ పయణం అవుతున్నారు.  టాలీవుడ్ లో కొంత కాలంగా పాపులారిటీ సంపాదించిన హీరోయిన ఒకరు కొత్త హీరోయిన్లు రావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.  దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 

ఈ నేపథ్యంలో ఓ సినిమా ఛాన్సు కొట్టేసిన ఆ హీరోయిన్ విచ్చలవిడిగా రెచ్చిపోతూ  టూ మచ్ గ్లామర్ షో చేసింది.  గతంలో తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని..ఇక్కడ స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదని..సాంప్రదాయమైన మాటలు మాట్లాడింది..కానీ ఇప్పుడు అక్కడ మాత్రం విపరీతమైన స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. 

అయితే ఇక్కడ కన్నా అక్కడ అందాలు ఆరబోస్తే ఎక్కువ డబ్బు గిట్టుబాటు అవుందని ఆ హీరోయిన్ గట్టి నమ్మకం..అందుకే  తెలుగు సినిమాల్లో తన పాత్రలు సింపుల్ గా ఉండి..హిందీ సినిమాలో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఇక్కడైతే  స్కిన్ షో విషయంలో షరతులు వర్తిస్తాయి..కానీ అక్కడ ఎంత ఎక్కువైతే అంత డబ్బు గిట్టుబాటు అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: