తెలుగు రాజకీయాలు, సినిమా గ్లామర్ రెండూ బాగా కలగలసిపోయాయి. ఇది నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న కధే. గతంలో అయితే సినిమా వాళ్ళను ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూడా జనం చేశారు. ఇపుడు కొత్త తరం వచ్చేసింది. ఆలోచనలూ మారుతున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలో తాజాగా ఎన్నికలు జరిగాయి.


ఇదిలా ఉండగా ఏపీలో మాత్రం సినీ తారల విషయానికి వస్తే,  స్వయంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటీలో నిలిచాడు. వేరే పార్టీల నుంచి కూడా సినిమా వాళ్లు బరిలో ఉన్నారు. ఐతే వీళ్లలో అందరికీ కూడా కొంత మేర ఓటమి భయం ఉండటం గమనార్హం. పవన్ విషయమే తీసుకుంటే ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాకలో ఆయన గెలుపు బాట పడతారు అంటున్నారు.  కానీ భీమవరంలో మాత్రం పవన్‌కు పరిస్థితి కష్టంగానే ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ పవన్ ఓడినా ఆశ్చర్యం లేదేమో. 


మరోవైపు పవన్ సోదరుడు నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేశాడు. చాలా లేటుగా టికెట్ ఖరారవడం, వివిధ కారణాల వల్ల నాగబాబు ఇమేజ్ కొంత దెబ్బ తినడం ప్రతికూలమైంది.  బలమైన అభ్యర్థుల్ని ఢీకొట్టాల్సి రావడం, తక్కువ రోజులు ప్రచారం చేయడంతో నాగబాబు గెలవడమూ కష్టమే అంటున్నారు. జనాలు ఆయన్ని ఓన్ చేసుకోలేదన్నది స్థానికుల మాట. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న రోజాకు నగరిలో ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు చెబుతున్నారు.


 వైసీపీకి  చిత్తూరు జిల్లాలో మంచి వేవ్ కనిపిస్తోంది కానీ.. ఎమ్మెల్యేగా రోజా పని తీరు బాగా లేకపోవడం, ఆమె స్థానికంగా పెద్దగా అందుబాటులో లేకపోవడం ప్రతికూలమైందని అంటున్నారు. వీళ్లందరూ కాక టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడు. ఆయన పనితీరుపై హిందూపురంలో ముందు నుంచి వ్యతిరేకత ఉంది. పైగా ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యవహార శైలి విమర్శల పాలైంది. దీంతో ఆయన కూడా ఓటమి భయం ఎదుర్కొంటున్నారు. మరి మే 23న వీరి జాతకాలు ఎలా ఉంటాయో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: