నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 5 సినిమాలు చేసినా ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేదని చెప్పాలి. అల్లుడు శీను నుండి లాస్ట్ వచ్చిన కవచం వరకు తన ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండేలా చూసుకున్న బెల్లంకొండ బాబు కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాధించలేదు.


లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా సీత. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఐటం సాంగ్ చేసింది. ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల వరకు చేసిందని తెలుస్తుంది. అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాను 40 కోట్ల దాకా బిజినెస్ చేశాడు.


జయ జానకి నాయకా సినిమా దాకా బిజినెస్ బాగా చేసిన బెల్లంకొండ బాబు సినిమా ఇప్పుడు బాగా పడిపోయిందని చెప్పొచ్చు. తేజ డైరక్షన్ లో వస్తున్న సీత సినిమా తక్కువ బడ్జెట్ తోనే నిర్మించబడింది. అందుకే ఈ సినిమా బిజినెస్ కూడా తక్కువే జరిగింది. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.


ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ నెల రిలీజైన మజిలీ, చిత్రలహరి రెండు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఇక ఈ వారం రాబోతున్న జెర్సీ కూడా ట్రైలర్ తో ఇంప్రెస్ చేసింది. సో లాస్ట్ వీక్ వస్తున్న సీత ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి. సీత సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ పెయిర్ ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: