ఈటీవీలో వస్తున్న  'జబర్దస్త్' కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ జబర్ధస్త్ చాలా దగ్గరైందని అంటారు. ఈ మద్య  'జబర్దస్త్' కామెడీ షో లో వల్గర్ కంటెంట్ వస్తుందని..ఈ కార్యక్రమంలో కొన్ని వర్గాల వారిని కించ పరిచే విధంగా ఉన్నాయని ఎన్ని అభియోగాలు వస్తున్నా.. 'జబర్దస్త్' కామెడీ షో రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతూనే ఉంది.  


ఇక  'జబర్దస్త్' కామెడీ షో మొదలైనప్పటి నుంచి ఈ కామెడీషోకి న్యాయనిర్ణేతలుగా నాగబాబు - రోజా వ్యవహరిస్తున్నారు.  ఇద్దరూ సీనీ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో..ఈ ప్రోగ్రామ్ కి మరింత వన్నె వచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నాగబాబు .. 'జనసేన' పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి.

మరోవైపు నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా మరోసారి పోటీలో నిలబడటం జరిగింది. గత నాలుగైదు వారాల నుంచి వీరిద్దరూ ప్రచారాల్లో మునిగిపోయారు. దీంతో ఇక రాజకీయాలపైనే నాగబాబు దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్ చేయకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరి స్థానంలో నటి మీనా, శేఖర్ మాస్టార్ న్యాయనిర్ణేతలుగా వస్తున్నారు.


తాజాగా జబర్ధస్త నుంచి తప్పుకుంటున్నాన్న వార్తలపై  నాగబాబు స్పందిస్తూ.. 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం .. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  అయితే నెలకు నాలుగు రోజులు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి న్యాయనిర్ణేతలుగా ఉంటామని..నా డేట్స్ ఎలాగైనా సర్దుబాటు చేసుకొని ఈ ప్రోగ్రామ్ లో కొనసాగుతానని ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను .. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటానని అన్నారు. అంతే కాదు పదవుల్లో ఉంటూ జడ్జీలుగా వ్యవహరిస్తున్నవారు చాలా మంది ఉన్నారు..ఎట్టి పరిస్థితుల్లోనూ జబర్ధస్త్ ని వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: