కమెడియన్ సునీల్ కాస్త హీరోగా మారి రకరకాల ప్రయత్నాలు చేశాడు. హీరోగా సిక్స్ ప్యాక్ లు గట్రా చేసి తనని హీరోగా కన్నా ఆడియెన్స్ కమెడియన్ గానే బాగా చూస్తారని అనుకున్న సునీల్ మళ్లీ కమెడియన్ గా తన పాత పంథా కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత అరవింద సమేత తర్వాత కమెడియన్ గా చేసిన సునీల్ ఆ సినిమా సక్సెస్ అందుకున్నాడు.


ఇక ఈమధ్య రిలీజైన చిత్రలహరి సినిమాలో కూడా సునీల్ కామెడీ ఇంప్రెస్ చేసింది. అందుకే ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ సునీల్ చెంత చేరిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత చేస్తున్న కొరటాల శివ మూవీలో సునీల్ ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సక్సెస్ లను అందుకున్న కొరటాల శివ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు.


సైరా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. సునీల్ కామెడీ టైమింగ్ అందరికి తెలిసిందే. అందుకే హీరోగా ఫ్లాప్ అయినా మళ్లీ కమెడియన్ గా వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. అసలైతే మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నెం 150 లో ఆలి చేసిన పాత్ర సునీల్ చేయాల్సింది.


ఆ టైంలో హీరోగా సినిమాలు కమిట్ అవడం వల్ల సునీల్ ఆ పాత్ర చేయలేదు. అయితే ఇప్పుడు కమెడియన్ గా మళ్లీ పాత స్టైల్ కొనసాగిస్తున్నాడు. చిరు, సునీల్ కామెడీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ అవకాశాలు చూస్తుంటే సునీల్ కు మళ్లీ మంచి రోజులొచ్చాయని చెప్పొచ్చు. సో ఇలానే కమెడియన్ గా కంటిన్యూ చేస్తే బెటర్ మళ్లీ హీరోగా చేస్తే మాత్రం రిస్క్ లో పడ్డట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: