నేచురల్ స్టార్ నాని నటించిన ‘మజ్ను’సినిమాలో మత్తెక్కించే అందంతో అందరినీ కట్టిపడేసిన అందాల రాశి అనూ ఇమ్యాన్యూయెల్.  కైపేక్కించే కళ్లు..అందమైన శరీర సౌష్టవం...ఆకట్టుకొనే రూపం..నటన కలగలసిన అనూ ఇమ్యాన్యూయెల్ మొదటి సినిమా ‘మజ్ను’.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అను కి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. దాంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది.  ఇదే సమయంలో ఆమె కొన్ని పొరపాట్లు చేసింది..కథ, బ్యానర్ విషయాల్లో ఏమీ ఆలోచించకుండా నటించడంతో వరుసగా పరాజయాలు అందుకొంది. 

ముఖ్యంగా త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’భారీ డిజాస్టర్ కావడంతో అనూ ఇమ్యాన్యూయెల్ కి పెద్ద దెబ్బే పడింది. ఇక అప్పటి నుంచి పైకి లేవడానికి ఎంత ప్రయత్నించినా లేవలేకపోతోంది. ఇప్పటి తన పరిస్థితికి తాను చేసిన తప్పులే కారణమంటోంది అనూ ఇమ్మాన్యూయేల్‌. కెరీర్‌ ప్రారంభంలో పాత్ర గురించి ఆలోచించకుండా సినిమాలు చేయడం వలనే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది వాపోతోంది. 

అందుకే సినీ పరిశ్రమలో వెనుకా ముందు ఆలోచించి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగాలని..హీరోల విషయాల్లో కూడా జాగ్రత్తలు పడుతూ కెరీర్ కొనసాగించాలని చాలా మంది హీరోయిన్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అవ్వాల్సిన డ్యామేజీ అయిపోయిన తరువాత ఇప్పుడు వగచి లాభమేమిటంటున్నారు సినీ జనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: