బోల్డ్ గా ఉండడం కొందరికి హాబీ. ఇక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో బోల్డ్ నెస్ లేకపోతే సక్సెస్ దూరంగా ఉంటుందంటారు. అందరితోనూ  కలివిడిగా కలుపుగోలుగా ఉండాలని అంటారు. ఇక ఇపుడు వస్తున్న హీరోయిన్లంతా అలాగే ఉంటున్నారు. స్క్రీన్ షేర్ చేసుకోవడంలోనూ పోటీ పడుతున్నారు.


విషయానికి వస్తే కొత్త అందం పేరు నిక్కీ తంబోలి. పేరుకు తగ్గట్టే అల్ట్రా మోడ్రన్ స్టైల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ మాస్ గుండెల్లోకి బుల్లెట్టులా దూసుకెళ్లింది. ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో లారెన్స్ మాస్టార్ కాంచన 3 ఈనెల 19న రిలీజ్ కి వస్తోంది. ఈ చిత్రంలో వేదికతో పాటు స్క్రీన్ ని పంచుకుంది నిక్కీ. కాంచన 3లో తంబోలి గ్లామరస్ రొమాంటిక్ ట్రీట్ అంతే ఇదిగా మత్తెక్కించబోతోందని తెలుస్తోంది. 


ఈ అమ్మడు ఇపుడు ఆఫర్ల కోసం తెగ హడావుడి చేస్తోంది. కాంచన త్రీ కనుక హిట్ అయితే ఇక తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తోంది.  హాటీగా, స్వీటీగా దేనికైనా రెడీ అంటున్నట్లుగా ఫోజులు ఇస్తున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కి కావాల్సిన హీట్ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతోంది. మరి చూడాలి. కొత్తందాన్ని మన వెండి తెర ఎలా వాడుకుంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: