కాజోల్ బాలీవుడ్ ఇండస్ట్రీని టాప్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ళు ఏలింది. బాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించింది. కుర్ర గుండెల్లో చిరస్థాయి గా నిలిచి పోయింది. తరువాత అజేయ దేవగన్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 


అయితే  యుక్త వయసులో కంటే మధ్య వయసుకు వచ్చాకే కాజోల్ చాలా అందంగా ఉంది.. ఆమె కొన్నేళ్లుగా కనిపిస్తున్న తీరుకు అందుతున్న కాంప్లిమెంట్స్ లో ఇదీ ఒకటి. కుర్ర హీరోయిన్ల కన్నా కాజోలే అందంగా ఉంది.. అనేది తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమె అందానికి దక్కిన కితాబు. 


తన వయసులో సగం ఉన్న జాన్వీకపూర్ వంటి వాళ్లతో కాజోల్ పోటీ పడుతోంది అని కూడా.. కొందరు వీరాభిమానులు అంటున్నారు! తాజాగా ఒక ఫిల్మీ ప్రోగ్రామ్ లో కాజోల్ ఇలా కనిపించింది! దుప్పట్టాను చీరలా చుట్టుకుని ఇలా అదరగొట్టింది. దేశీ లుక్ కు వెస్ట్రన్ ను మిక్స్ చేసినట్టుగా కనిపించిన కాజోల్ స్టిల్స్ వైరల్ గా మారాయి. చీరకట్లులో కనిపించిన కాజోల్ కు బోలెడన్ని కాంప్లిమెంట్స్ అందుతున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: