ఒకప్పుడు థియేటర్లో హర్రర్ సినిమాలు చూడాలంటే కొంత మందికి మాత్రమే ధైర్యం ఉండేది..ఆ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్..కెమెరా ట్రిక్స్..థ్రిల్లర్ ఆడవారు, చిన్న పిల్లలు చాలా దూరంగా ఉండేవారు.  కానీ ఈ మద్య వస్తున్న హర్రర్ మూవీలు చూడాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడి పోతున్నారు.  దీనికి కారణం ఈ మద్య కాలంలో వస్తున్న హర్రర్ సినిమాలు భయపెట్టడమే కాదు..కడుపుబ్బా నవ్విస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకులు లారెన్స్ ‘ముని’సినిమా తో మంచి విజయం అందుకున్నాడు.

నవ్విస్తూనే భయపెట్టిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది.  దాంతో ఈ సినిమా సీక్వెల్ కాంచన తీశారు.  ఈ సినిమా కూడా ఘన విజయం సాధించడమే కాదు..కలెక్షన్లు కూడా పది రెట్లు ఎక్కువగా వచ్చాయి.  ఈ సినిమా సీక్వెల్ గంగా..తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం అందుకుంది. తాజాగా ముని సీక్వెల్ 4 , కాంచన 3 నిర్మితమైంది.

ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లారెన్స్ సరసన వేదిక, ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.  తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ సినిమా 9.13 కోట్ల షేర్ ను సాధించింది. హారర్ తో పాటు కామెడీకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం వలన, ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 

అయితే లారెన్స్ గత రెండు సినిమాలు కూడా ఇదే నేపథ్యంలో వచ్చినా..ఎప్పటికప్పుడు తన లుకింగ్ డిఫరెంట్ గా చూపిస్తున్నారు.  గ్రాఫిక్స్ కూడా బాగా వాడుకుంటున్నారు. సాధారణంగా లారెన్స్ సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలా 'కాంచన 3'లోని మాస్ అంశాలు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: