తెలుగు చలన చిత్రం పరిశ్రమకు 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఓ అక్కినేని, ఓ నందమూరి ఇలా అనేకమంది  ప్రముఖులు కలసి అల్లిన చల్లని పందిరి తెలుగు  సినీ సీమ. వారి వారసులు. నటనా వరసులు ఎంతో మంది ఈ రంగంలో ఉంటూ టాలీవుడ్ పేరుని పెంచుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే టాలీవుడ్ ఉమ్మడి ఏపీలో చల్లగా వర్ధిల్లుతూండేది. ఎవరు అధికారంలోకి వచ్చినా వారికి చేరువగా ఉంటూ మనుగడ సాగించేది.


ఎపుడైతే విభజన జరిగిందో అప్పటి నుంచే టాలీవుడ్ కొంత ఇరకాటంలో పడింది. 2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో అక్కడ కూడా చిత్ర సీమ అభివ్రుధ్ధి చెందుతుందని అంతా భావించారు. అయితే బాబు సైతం సినిమా రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టాలీవుడ్ పెద్దలు సైతం హైదరాబాద్ వీడి రావడానికి ఇష్టపడలేదు. వీటన్నిటికీ మించి రాజకీయ సమీకరణలు వారిని కట్టి పడేశాయి.


కేసీయార్తో బాబుకు పొసగని వైనం ఎరిగిన సినీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. తెలివిగా బాబు వూసెత్తకుండా ఉన్న చోటే తమ పనులు చేయించుకుంటూ గడిపేశారు. ఇపుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైసీపీ కనుక పవర్లోకి వస్తే టాలీవుడ్లోనూ సమీకరణలు మారుతాయని అంచనా వేస్తున్నారు. ఎటూ కేసీయార్, జగన్ ల మధ్య మంచి స్నేహ సంబంధాలు
ఉన్నందున టాలీవుడ్ పెద్దలు హ్యాపీగా ఏపీ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయంటున్నారు.


అదే విధంగా జగన్ సైతం సినీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపధ్యంలో ఏపీలో మరో టాలీవుడ్ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే  జగన్ అధికారంలోకి వస్తే మాత్రం  తెలుగు సినీ రంగానికి ఏపీలో కూడా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు అధికంగా  ఉన్నాయని అంతా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: