యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని సెలబ్రిటీస్ కూడా ఇస్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సామెతని బాగా అలవరుచుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నా చాలా వినయంగా ఉంటాడు. అది ప్రభాస్ గొప్పతనం అని చెప్పుకోవచ్చు.


ఇదిలాఉంటే ప్రభాస్ తో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న పూజా హెగ్దె ప్రభాస్ లాంటి హీరోని ఇప్పటివరకు తాను చూడలేదని స్వీట్ పర్సన్ అని చెబుతుంది. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్దె కలిసి సినిమా చేస్తున్నారు. యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ పిరియాడికల్ మూవీగా ఇది తెరకెక్కుతుంది.


ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో ప్రభాస్ ఎంత మంచి వాడో అర్ధమైందని. తన స్టార్ డం వచ్చినా చాలా డౌన్ టూ ఎర్త్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది పూజా హెగ్దె. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కొత్తగా ఉంటుందని.


ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని అంటుంది. పూజా చెబుతున్న మాటలను బట్టి చూస్తుంటే సాహో తర్వాత ప్రభాస్ మరోసారి రికార్డుల మీద కన్నేసినట్టు తెలుస్తుంది. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో సినిమా ఈ ఇయర్ ఆగష్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: