టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా ఇటీవల వేసవి కానుకగా విడుదలైన జెర్సీ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది ఒక్క హిట్ కూడా సాధించలేకపోయిన న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమా ఇచ్చిన విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి  పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Image result for jersey movie director ntr

ముఖ్యంగా ఇండస్ట్రీలో నుండి చాలా మంది ప్రముఖుల ద్వారా ప్రశంసలందుకున్న డైరెక్టర్ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లతో కూడా అభినందనలు అందుకోవడం విశేషం. ఇండస్ట్రీలో ఏదైనా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా వచ్చిందంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కాంప్లిమెంట్ ఇవ్వడం కామన్. అయితే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కి జూనియర్ ఎన్టీఆర్ పొగడటం వెనుక పెద్ద కారణమే ఉందని ఫిలింనగర్ టాక్.

Image result for jersey movie director ntr

విషయం ఏమిటంటే తారక్ కి గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే పరిచయం ఉందట. ఈ దర్శకుడు తారక్ కు జెర్సీ కంటే ముందే కథ చెప్పాడట. గౌతమ్ సెన్సిబిలిటీస్ నచ్చాయని, తారక్ ప్రశంసలు కురిపించాడని తెలుస్తుంది. అందుకే తారక్ సినిమా గురించి పోస్ట్ చేశాడని ఇండస్ట్రీ లో నుండి వస్తున్న వార్త. అంతేకాకుండా ఈ సినిమా చూసిన తారక్ తనకు మంచి స్టోరీ రెడీ చేయమని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కి ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. మొత్తం మీద జెర్సీ సినిమా విజయంతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జూనియర్ ఎన్టీఆర్ కి త్వరలోనే స్క్రిప్ట్ చెప్పబోతున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: