మహేష్ బాబు 25వ సినిమా మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడానికి సన్నద్దమవుతున్నారు సినిమా యూనిట్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. వ్యవసాయానికి సంబంధించిన స్క్రిప్ట్ లో మహేష్ బాబు రైతులకు అండగా ఉండే తరహాలో ఈ సినిమా చిత్రీకరించారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి.

Image result for maharshi

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలను మరియు టీజర్లను విడుదల చేసి మహేష్ అభిమానులను ఎంతగానో అలరించారు డైరెక్టర్. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు సినిమా యూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్డులో మే 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకు భారీగా రిలీజ్ వేడుక చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Image result for maharshi

ముఖ్యంగా ఈ వేడుకలో మహేష్ బాబు 25 సినిమాలు నటించిన నేపథ్యంలో ఓ వినూత్న కార్యక్రమాన్ని అభిమానులకు అందివ్వడానికి మహర్షి సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహర్షి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: