ఆ మద్య కోలీవుడ్ లో మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సర్కార్’సినిమాలో ఓటు విలువ ఎంటో చూపించారు.  తన ఓటు మరెవరో వేస్తే ఫారిన్ నుంచి వచ్చిన విజయ్ తన ఓటు గల్లంతుపై ఈసికి ఫిర్యాదు చేసి ఏకంగా తనకోసం ప్రత్యేక ఓటింగ్ ఏర్పాటు చేస్తాడు.  ఈ సినిమాలో నేటి సమాజంలో ఓటింగ్ సరళి పై చాలా బాగా చూపించారు.  ఇటీవల జరిగిన రెండో దశ ఎన్నికలలో ఓటు వేసేందుకు నటుడు శివకార్తికేయన్‌, ఆయన భార్య ఆరతి  చెన్నైలో వలసరవక్కంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులపై మండిపడ్డాడు.


తన ఓటు తీసేశారని, ఇది దుర్మార్గమంటూ మీడియా ముందుకొచ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన భార్య ఆరతి ఓటు వేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయినా, గంట తర్వాత మళ్లీ వచ్చి ఓటు వేసి సగర్వంగా బయటకు వచ్చారు.  ఓటు వేసినట్టు వేలిని చూపిస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశాడు. తొలుత ఓటు లేదని హంగామా చేసి ఇప్పుడు ఓటు ఎలా వేశారంటూ మీడియా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరైన నటుడు ప్రత్యేక అనుమతితో వచ్చి ఓటేశానని వివరణ ఇచ్చాడు.


 ఓట‌ర్ల జాబితాలో పేరు లేకున్నా ఓటు ఎలా వేశారు?  ఇది క‌చ్ఛితంగా స‌ద‌రు ఎన్నిక‌ల కేంద్రం అధికారుల త‌ప్పిదంగా ఈసీ ఫైర్ అవుతోంది. ఈ విషయంపై తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి సత్యబ్రత సాహూ.. భిన్నంగా స్పందించారు. ఓటు వేసేందుకు శివను అనుమతించడం స్థానిక ఎన్నికల అధికారులు చేసిన తప్పిదమన్నారు. ఎన్నికల అధికారులకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: