లోకనాయకుడు.. విశ్వనటుడు.. కమల్ హాసన్ నట విశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా కమల్ హాసన్ చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదేమో ప్రయోగాలతో ఎప్పటికప్పుడు తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కమల్ హాసన్ పని. ఆనాటి స్వాతిముత్యం నుండి దశావతారాల వరకు కమల్ హాసన్ నటనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.  


అయితే ఆ రేంజ్ లో కాకున్నా కమల్ హాసన్ లానే ఎంచుకున్న పాత్రకు న్యాయం చేసే వారిలో తెలుగు పరిశ్రమలో స్టార్స్ తో పాటుగా నాచురల్ స్టార్ నాని ముందుంటాడని తెలుస్తుంది. ఈమధ్యనే వచ్చిన జెర్సీ సినిమాతో నాని నటుడిగా మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. నాని నట విశ్వరూపం జెర్సీ సినిమాలో చూడొచ్చు.


అర్జున్ పాత్రలో అసలు నాని కనబడలేదు. అంతగా మెప్పించాడు మన నాచురల్ స్టార్. చూస్తుంటే ఇలానే కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా ప్రయోగాలతో ఈ తరం కమల్ హాసన్ అనిపించుకునేలా ఉన్నాడు నాని. నాని కథల ఎంపిక కూడా అలానే ఉంది. అయితే కమల్ ఇంకా చాలా ప్రయోగాలు చేశాడనుకోండి.


ఏది ఏమైనా నాచురల్ స్టార్ గా తన స్క్రీన్ నేం ను సార్ధకం చేస్తూ సినిమా సినిమాకు తన నటనతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు నాని. అష్టా చెమ్మ సినిమా నుండి జెర్సీ వరకు నాని చేసిన ఈ సినిమాలు చూస్తే నటుడిగా సినిమా సినిమాకు ఎలా గ్రాఫ్ పెంచుకున్నాడో తెలుస్తుంది. మరి కమల్ వారసుడు నాని అనేందుకు ఇంకా టైం ఉన్నా కచ్చితంగా నటుడిగా నాని అదరగొడుతున్నాడన్నది వాస్తవం.



మరింత సమాచారం తెలుసుకోండి: