ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ గురించి హాట్ టాపిక్ అయ్యింది.. ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాల్లో బుధవారం రిలీజైన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈరోజు అనగా శుక్రవారం ఇండియా, అమెరికా, కెనడాల్లో రిలీజ్ అవుతుంది. ఇండియా మొత్తం మెద 2000 నుండి 3000 స్క్రీన్స్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అవుతుంది. 


ఈ సినిమా చూసేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం విశేషం. అందుకే బుక్ మై షోలో టికెట్స్ ఇలా పెట్టడమే ఆలస్యం అలా అయిపోతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. బాహుబలి కోసం 33 లక్షల టికెట్స్ అడ్వాన్స్ రూపంలో అమ్ముడవగా అవెంజర్స్ ఆ రికార్డుకు దగ్గరగా వచ్చింది.


ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, తమిళ, హింది భాషల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అవుతుంది. అమెరికాలో 4600 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మార్వెల్ సినిమాస్ నుండి వచ్చ్న 21వ సినిమాగా అవెంజర్స్ ఎండ్ గేం చైనాలో కూడా ఓపెనింగ్ రికార్డులను కొల్లగొట్టింది. చైనాలో ఈ మూవీ 107.5 మిలియన్ డాలర్లను మొదటిరోజే వసూళు చేసిందట. 


చైనాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇండియా, కెనెడా, అమెరికా వంటి దేశాల్లో రిలీజ్ కాకముందే అవెంజర్స్ ఖాతాలో 160 మిలియ డాలర్స్ వచ్చాయి. మన కరెన్సీలో చెప్పాలంటే 1186 కోట్లు వచ్చాయన్నమాట. ఫస్ట్ వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా 800 మిలియ డాలర్స్ వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.



మరింత సమాచారం తెలుసుకోండి: