కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఎప్పుడు ముందుటారు... కొన్ని రోజులుగా పెద్ద సినిమాలను నిర్మించే పనిని పక్కన పెట్టిన ఆయన చిన్న సినిమాలపైనే ఎక్కువ ద్రుష్టి సారిస్తున్నారు. గతంలో "పెళ్లిచూపులు" "మెంటల్ మదిలో" చిత్రాలను సమర్పించిన సురేష్ బాబు ఆ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఈ సంవత్సరం ఏకంగా ఆరు చిన్న సినిమాలను లైన్ లో పెట్టారు సురేష్ బాబు. 

వాటిలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ నడిచిన "ఏబీసీడీ" .."ఈనగరానికి ఏమైంది?" ఫేమ్ విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహించిన "ఫలక్ నుమాదాస్", చింతకంటి మల్లేశం బయోపిక్ గా వస్తున్న "మల్లేశం", విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, డా.రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న "దొరసాని", నివేదా థామస్ "బ్రోచేవారేవురా !", సమంత మెయిన్ లీడ్ గా వస్తున్న "ఓహ్ బేబీ" చిత్రాలు ఉన్నాయి.

వీటిలో కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉంటే మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలను సురేష్ బాబు స్వయంగా సమర్పిస్తుండటం, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్రాండ్ ఈ సినిమాలకు అందటంతో  వీటికి  మార్కెట్ లో మంచి క్రేజ్ లభిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక ఆటు ఓవర్సీస్ లో కూడా సురేష్ బాబు బ్రాండ్ ని చూసి ఈ చిత్రాలను మంచి మార్కెట్ లభించడంతో ఈ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందే లాభాలను చూసే అవకాశం కలుగుతోంది, దీంతో అందరు నిర్మాతలు సురేష్ బాబులా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తే పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుగు సినిమా అభిమానులు ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: