విజయ్ దేవరకొండ ,రష్మిక లు గీత గోవిందం తరువాత మళ్ళీ కలిసి నటిస్తూ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయబోతున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రం లో వీరిద్దరూ మళ్ళీ జోడి కడుతున్న విషయం తెసిందే. గీత గోవిందం లో వీద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది. అందుకే ఇప్పుడు వస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం కోసం విజయ్ ఫాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇప్ప్తుడు ఈ చిత్రం కోసం ఒక పాటను కేరళ లోని  ఒక అందమయిన ప్రదేశం లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ షూటింగ్ గ్యాప్ లో ఒక అందమైన బ్యాగ్రౌండ్ లో  ఎంతో క్యూట్ గా కనిపించిన రష్మిక ను తన  కెమెరా లో బంధించాడు విజయదేవరకొండ.


అలా ఎంతో హాట్ గా , క్యూట్ గా ఉన్న రష్మిక ఫోటోలకు సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఏడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి . వావ్!  రష్మిక ఎ, చాలా అందంగా కనిపిస్తున్నావు అంటూ నెటిజెన్ల చేస్తున్న కామెంట్లకు రష్మిక ఈ క్రెడిటంతా విజయ్ కే దక్కుతుంది అంటూ ఎంతో వినయంగా సమాధానమిస్తొంది  .ఏది ఏమైనా ఈ ఫోటోల్లను చూసినవారంతా "ఇంకేమి ఇంకేమి కావాలే చాల్లే ఇది చాల్లే "అంటూ పాటలు పాడేస్తున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: