అక్కినేని వారి కోడలిగా సమంత అభిమానులను ఇంకా ఎక్కువగా సంపాదించుకున్నది. అయితే వాణిజ్య ప్రకటన రూపొందించిన యాడ్ డైరెక్టర్ చేసిన పనికి ఏకంగా మామపైనే  కోడలు పంచ్ వేసి దొరికిపోవాల్సొచ్చింది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో మామ ఎవరు.. కోడలు ఎవరు? అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. నాగార్జున మామపై కోడలు సమంత ఓ వాణిజ్య ప్రకటనలో అదిరిపోయే పంచ్ వేయడం చర్చకు వచ్చింది. అయితే అది తెలిసి జరిగిన పొరపాటా లేక తెలియక జరిగినదా? అన్నది అటుంచితే అసలేం జరిగింది? అన్నది చూస్తే ఆసక్తికరం.


మామ కోడళ్లు ఇద్దరూ డిటర్జెంట్ ప్రకటనలకు పెట్టింది పేరు అన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా `ఘడి` అనే  డిటర్జెంట్ బ్రాండుకు కింగ్ నాగార్జున ప్రచారం చేస్తున్నారు. అందులో ఆయన డైలాగులు అభిమానులు మర్చిపోలేరు.`వాడి చూడండి. తర్వాతే నమ్మండి` అంటూ కింగ్ ఘడి డిటర్జెంట్ గొప్పతనాన్ని చెప్పారు. దీనికి కౌంటరా అన్నట్టు సామ్ తాజా డిటర్జెంట్ యాడ్ పెద్ద షాక్ నే ఇచ్చింది.


ట్రిపులెక్స్ డిటర్జెంట్ తరపున ప్రచారం చేస్తున్న సామ్ .. ఈ ప్రకటనలో పలికే ఓ డైలాగ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందిట. 30 ఏళ్లుగా వినియోగంలో ఉన్న డిటర్జెంట్ ఇది. ``స్వయంగా మీరే టెస్ట్ చేసి చూశారుగా.. మరి ల్యాబుల్లో టెస్టులెందుకు? వాడి చూడండని చెప్పడమెందుకు?`` అంటూ అదిరే పంచ్ నే వేసింది సామ్. ఈ పంచ్ కాంపిటీటివ్ డిటర్జెంట్ పైనేనా.. లేక మామ పైనా అన్నది సామ్ నే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం ఈ తప్పిదంపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: