టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ తర్వాత నిర్మాతగా మారారు.  స్టార్ హీరోలతో సినిమాలు తీసి మంచి విజయం అందుకున్నారు.  అప్పట్లో బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమాలు వస్తున్నాయంటే ఎన్నో అంచనాలు ఉండేవి.  కొంత కాలం తర్వాత బండ్ల గణేష్ సినిమాలు తీయడం ఆపారు.  దానిపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి..ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వచ్చారు.  కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు రాహూల్ గాంధీని కలిసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.  


అప్పుడే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం..కాంగ్రెస్ తరుపు నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.  ఆ సమయంలో బండ్ల గణేష్ పై రోజు ఓ న్యూస్ ఉండేదంటే..ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.   ఆ వెంటనే బండ్ల గణేష్ కనిపించకుండా పోయి..కొన్ని రోజుల తర్వాత మల్లీ తెరపైకి వచ్చి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  


తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రాజకీయాల్లోకి రాకముందు కొందరు తనను సూపర్ స్టార్, మెగాస్టార్ అన్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చాకనే అసలు విషయం అర్థమైందని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌‌ పేర్కొన్నారు. రాజకీయాలు చాాలా కష్టమని అర్థమైంది, పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పాలి. ప్రతి ఒక్కరినీ తిట్టి వారికి శత్రువు కావాలి. నాకు అన్ని పార్టీల్లో కావాల్సిన వారున్నారు. ఎందుకు తిట్టి దూరం కావడం... సినిమా వాడిగా ఉంటే అందరి వాడిగా ఉండొచ్చు అందుకే  రాజకీయాలు వద్దనిపించింది. దానివల్ల అందరికీ దూరమవుతాం అన్నారు.  


తాను రాజకీయాలకు పనికి రానని ఎన్నికలకు ముందే తేలిందని కానీ, బయటకు వచ్చేస్తే బాగుండదని పార్టీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.  నేను రాజకీయ ప్రవేశం తెలిసి చేసిన తప్పు పెద్ద తప్పు చేశాను.   గతంలో  మా నాన్న చెబితే పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన చెప్పిందే  నిజం.. పశ్చాత్తాపం చెందుతూ నాకొద్దు బాబూ ఈ రాజకీయాలకు దండం పెట్టాను.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది ఒక కోరిక అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది రెండో కోరికగా గణేష్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: