టాలీవుడ్లో జూనియర్లు ఎంతమంది వచ్చినా సీనియర్ హీరోల హవా అలాగే కొన‌సాగుతోంది. చిరంజీవి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాక టాప్ ఫౌర్ కి ధీమా పెరిగింది. మరి కొంతకాలం మూవీస్ చేయవచ్చునని బాలయ్య, వెంకీ, నాగ్ డిసైడ్ అయిపోయారు. ఇపుడు ఈ నలుగురూ చాలా స్పీడ్ గా మూవీస్ చేస్తున్నారు. వారి కోసం కొత్త క్యారక్టర్లు కూడా డైరెక్టర్లు డిజైన్ చేస్తున్నారు.


ఇక విషయానికి వస్తే చిరంజీవి, బాలయ్య తమ క్యారక్టర్లకు అనుగుణంగా ఇపుడు వెయిట్ బాగా తగ్గనున్నారట. చిరంజీవి ఇపుడు అరవై  ప్లస్ లో ఉంటే. బాలయ్య అరవైకి రీచ్ అవుతున్నాడు. అయినా ఈ వయసులో కూడా ఈ ఇద్దరు సీనియర్లు తమ బరువుని తగ్గించుకోవడానికి రెడీ అవుతున్నారంటే హాట్సాఫ్ చెప్పాల్సిందే.


సైరా మూవీ తరువాత చిరంజీవి చేయబోయేది కొరటాల శివ మూవీ. అందులో మోడర్న్ క్యారక్టర్ చిరుదిట. దాని కోసం బాగా తగ్గాలని, యంగ్ లుక్ కావాలని శివ పట్టుపట్టడంతో ఏకంగా నలభై రోజుల పాటు వెయిట్ లూజ్ కి చిరు రెడీ అయిపోతున్నారు. సైరా తరువాత చిరు దీని మీదే ద్రుష్టి పెడతారని టాక్.


అదే విధంగా బాలయ్య కూడా బోయపాటి మూవీ కోసం వెయిట్ లూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ మూవీలో రెండు పాత్రల్లో బాలయ్య కనిపిస్తారట. యంగ్ పాత్రకు బరువు తక్కువ ఉండాలని కోరడంతో బాలయ్య సరేనని అన్నాడట. మొత్తానికి సీనియర్లు ఇద్దరూ సినిమా మీద అంకితభావంతో చేస్తున్న క్రుషికి మెచ్చుకోవాల్సిందే. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: