ఆ మద్య భారత దేశ వ్యాప్తంగా సంజయ్ లీలా బన్సాలీ తీసిన సినిమా ‘పద్మావత్’ ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో దీపికా పదుకొనె ప్రధాన పాత్ర పోషించగా హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయని కొన్ని హిందూ సంఘాలు పెద్ద గొడవ చేశాయి.  ఒకదశలో పద్మావత్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.  ఈ సినిమా కోర్టు లో ఎన్నో వివాదాలు ఎదుర్కొని మొత్తానికి రిలీజ్ అయ్యింది.  ఇప్పుడు ఏపిలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 

ఈ సినిమాలో సీఎం చంద్రబాబు ను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని..ఈ సినిమా రిలీజ్ ని ఆపివేయాలని టీడీపీ శ్రేణులు కోర్టు కెక్కారు. ఏపిలో తప్ప ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయ్యింది.  అయితే ఏపిలో రేపు మే డే సందర్భంగా రిలీజ్ చేస్తానని రాంగోపాల్ వర్మ తెలిపారు.  తాజాగా ఏపీలో రేపు విడుదల చేయాలనుకున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి బ్రేక్ పడింది. ఈ చిత్ర విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఏప్రిల్ 10న వెలువరించిన ఆ ఉత్తర్వులో పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా విడుదలపై తరుపరి ఉత్తర్వులు ఇవ్వలేదని ఎన్నికల సంఘం తెలిపింది.  కాగా, ఈ ఉత్తర్వుల ప్రతిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపింది. సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: