రాజమౌళి దర్శకత్వంలో  ఎన్టీఆర్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ‘RRR’ సినిమా గురించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా బాహుబలి విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తుందని తెగ చర్చించుకుంటున్నారు. ఇదిలావుండగా ఈ సినిమా టైటిల్ మీరే పెట్టాలని ప్రేక్షకులకు వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Image result for RRR

దీంతో వివిధ భాషలకు చెందిన అభిమానులు తము అనుకున్న టైటిల్స్ ని ప్రమ్పిస్తున్నారు. 'రఘుపతి రాఘవ రాజారాం', 'రాజ్యం రణం రక్తం', 'రాముడు రుద్రుడు రణరంగం' ఇలా చాలా మంది పంపించిన టైటిల్స్ ని 'RRR' యూనిట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Image result for RRR

అన్ని భాషల నుండి 'RRR'కు సంబంధించిన ఎబ్రివేషన్స్ వెల్లువలా వస్తున్నాయని అందులో కొన్ని పవర్ ఫుల్ గా, కొన్ని భావయుక్తంగా, మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని అన్నారు. ఇంకా టైటిల్స్ పంపాలని, ఎవరికి తెలుసు.. మీరు పంపించేదే 'RRR' అసలు టైటిల్ అవుతుందేమో అంటూ పోస్ట్ పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: