హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నిఖిల్ తర్వాత స్వామిరారా, కార్తికేయ సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు.  నిఖిల్ నటించిన సినిమాలు అన్నీ మంచి హిట్ సాధిస్తున్నాయి. తాజాగా  నిఖిల్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా అర్జున్‌ సురవరం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీ మే 1న రిలీజ్‌ కావాల్సి ఉండగా మరో వాయిదా వేశారు.


ప్రస్తుతం థియేటర్లలో ఉన్న అన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటంతో థియేటర్ల సమస్య ఎదురవుతుందని భావించి సినిమాను వాయిదా వేశారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా..టైటిల్ వివాదం కొంత ఆలస్యం చేసింది.  ఈ నెల సినిమా రిలీజ్ చేయాలని చూసినా మజిలీ, జెర్సీ, కాంచన3 లాంటి సినిమాలతో పాటు ఎంతో క్రేజ్ సంపాదించిన హాలీవుడ్ మూవీ అవేంజర్స్ సినిమాలు ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేశారు.  


 మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ మహర్షికి సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే ఆ ప్రభావం రెండు వారాల పాటు ఉంటుంది.  అర్జున్ సురవరం చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.  ఇటీవల త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిఖిల్  తెలిపాడు. తాజాగా అర్జున్ సురవరం చిత్ర యూనిట్ విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో  మే 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయానికి మహర్షి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేం. మే చివరి వారంలో సీత, ఎన్జీకే లాంటి సినిమాలు విడుదలవుతున్నాయి. ఎటు చూసుకున్న నిఖిల్ అర్జున్ సురవరం మూవీకి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మూవీలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: