బాలీవుడ్ లో ఇప్పటి వరకు టాప్ హీరోల తనయుడు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  కానీ గత కొంత కాలంగా టాప్ మీరోల కూతుళ్లు కూడా హీరోయిన్లు గా రాణిస్తున్నారు. కపూర్ ఫ్యామిలీకి చెందిన రణదీర్ కపూర్ కూతుళ్లు కరీష్మా, కరీనా కపూర్ లో హీరోయిన్లుగా వచ్చారు.  అనీల్ కపూర్ కూతురు సోనం కపూర్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్ కూతురు సోహా అలీకాన్, శతృఘ్న సిన్హా  కూతురు సోనాక్షీ సిన్హా ఇలా ఎంతో మంది హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. 

తాజాగా ఒకప్పటి కామెడీ హీరో చుంకీపాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా వస్తుంది.  బాలీవుడ్ తెరపై హవా కొనసాగిస్తోన్న యువ కథానాయికలకు గట్టిపోటీ ఇవ్వడానికి అనన్య పాండే రంగంలోకి దిగుతోంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ఆమె రానుంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ద్వారా పరిచయమైన వరుణ్ ధావన్ అంటే నాకు చాలా ఇష్టం. 

ఈ హీరో అంటే తనకు ఎంతో ఇష్టమని..ఒక రకంగా చెప్పాంటే పిచ్చని.. ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడని.. అతనంటే  నాకు పిచ్చిప్రేమ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల వరుణ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ స్టూడెంట్ .. నువ్వంటే నాకు ఎప్పటికీ ఓ క్రష్  అంటూ ట్వీట్ కూడా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: