సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం "మహర్షి" , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని  దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇక మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా "విక్టరీ" వెంకటేశ్‌, విజయ్‌ దేవరకొండలు హాజరయ్యారు. ఇక "మహర్షి" చిత్రం  మహేశ్‌ కెరీర్ లో 25వ చిత్రం కావడంతో మహేష్ తొలి సినిమా "రాజకుమారుడు" దర్శకుడు కె.రాఘవేంద్రరావు మహేష్ గురించి ప్రత్యేక వీడియోలో తన సందేశాన్ని తెలిపారు. 
ఆయన మాట్లాడుతూ "ముందుగా 25 సినిమాలు పూర్తి చేసినందుకు మహేశ్‌బాబుకు శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ఎంత ఆనందపడుతున్నారో.. నేనూ అంతే ఆనందపడుతున్నా. మహేష్ మొదటి చిత్రం "రాజకుమారుడు"  షూటింగ్‌ సమయంలో ఎంతో ప్రేమగా మామయ్య అని పిలిచే పిలుపు నాకు ఇంకా గుర్తుంది. మహేష్ ఇంకా గొప్ప నటుడు కావాలని ఆశిస్తూ గుడ్‌లక్ "అని చెప్పారు. 
ఇక ఈ వేడుకలో మహేష్ తో పనిచేసిన దర్శకులతో పాటు మహేష్ తో పనిచేసిన హీరోయిన్స్, సాంకేతిక  నిపుణులు అందరు మహేష్ తో తమకున్న అనుభవాలని ప్రత్యేకంగా పంచుకున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: