స్టార్ మా ప్రెస్టిజియస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 3వ సీజన్ కోసం హోస్ట్ గా ఎవరు చేస్తారా అని నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ లిస్ట్ లో నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ ఇంకా విజయ్ దేవరకొండ వంటి హీరోస్ కూడా ఉన్నారు.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది.. క్రేజీ థాట్ కదా.. అయితే బిగ్ బాస్ సీజన్ 3 కాదు అసలు బిగ్ బాస్ తెలుగు కాన్సెప్ట్ అనగానే ఎన్.టి.ఆర్ కన్నా ముందు అల్లు అర్జున్ దగ్గరకే వెళ్లిందట. బన్ని అప్పుడు సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఎన్.టి.ఆర్ కు ఆ ఛాన్స్ వచ్చింది.


ఏమాటకామాట కాని తారక్ బిగ్ బాస్ సీజన్ 1 అదరగొట్టేశాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 ఆఫర్ కూడా బన్ని దగ్గరకు వచ్చిందట. స్వయంగా అల్లు అరవింద్ గారే బన్నిని హోస్ట్ చేయాలని అడిగారట కాని అప్పుడు కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేనని చెప్పాడట బన్ని. అయితే బిగ్ బాస్ 3 ఆఫర్ వచ్చినా ఇప్పుడు నాది అదే ఆన్సర్ అందుకే ఈసారి తనని ఎవరు అడగలేదని అంటున్నాడు బన్ని.


నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి రీసెంట్ గా త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో మూవీ మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత ఐకాన్ మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ రెండిటితో పాటుగా సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఒకటి చేయాల్సి ఉంది. మొత్తానికి బన్ని బిగ్ బాస్ అంటే మాత్రం వరుస సినిమాలు ఉన్నాయని తప్పించుకుంటున్నాడు. ఏదో ఒక సీజన్ బన్ని కూడా హోస్ట్ గా చేయాలని ఆశిద్దాం. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: