తమిళ ప్రఖ్యాత నటుడు సూర్యతో వివాహం తర్వాత నటి జ్యోతిక సినీ ఫీల్డ్ కి దూరమయ్యారు, అయితే చాలా కాలం తర్వాత "36" అనే తమిళ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "నవాబ్" చిత్రంలో కీలకపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. 

ఇక ఇటీవలే జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన "నాచ్చియార్" తమిళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.అదే చిత్రం "ఝాన్సీ" పేరుతో తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీ తో ఒక సినిమా చేస్తున్న జ్యోతిక తాజాగా  "జాక్ పాట్" అనే చిత్రంలో నటిస్తోంది. పూర్తిస్థాయి వినోద భరితంగా సాగే ఈ చిత్రంలో జ్యోతిక పాటు అలనాటి నటి రేవతి కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తుందట. 

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ రీ ఎంట్రీ తర్వాత ఇది వరకు జ్యోతిక నటించిన చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. హాస్య ప్రధానంగా ఈ సినిమాను రూపొందించాం. రేవతి కూడా పోలీసు పాత్రలో కనిపిస్తారు. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. రెండు గంటలపాటు సరదాగా నవ్వుకోవచ్ఛు జ్యోతిక హిట్ల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుంది. వినోదంతోపాటు తప్పకుండా ఓ సందేశం కూడా ఉందని’’ పేర్కొన్నారు. 

ఈ చిత్రానికి ఆనంద్‌కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌ కాగా, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించగా 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నటుడు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబవ్వబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: