"ఇస్మార్ట్ శంకర్" ... పూరిజగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం.  ప్రస్తుతం వారణాసిలో  షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని పూరి టూరింగ్ టాకీస్ పై పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతుండగా ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

ఇక ఈ చిత్రంలో రామ్ ఒక హ్యాకర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఇదిలా ఉండగా ఈ చిత్రం ఒక హాలీవుడ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 2016 లో విడుదలైన ఇంగ్లీష్ సినిమా ‘క్రిమినల్’ లాగానే ఈ చిత్రం ఉండబోతోందని కొందరు చెబుతున్నారు.
"క్రిమినల్"  సినిమా కథ ప్రకారం ఒక హ్యాకర్ ని సిఐఎ ఏజెంట్ పట్టుకోవాలి అనుకుంటాడు. కానీ ఆ ఏజెంట్ ని ఎవరో చంపేసి అతని బ్రెయిన్ లోని మెమరీస్ ని చిప్ ద్వారా క్రిమినల్ బ్రెయిన్ లోకి పంపిస్తారు. ఎంతో ఆసక్తిగా  ఉండే ఈ థ్రిల్లర్ హాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మరి పూరి అదే నేపధ్యం ఉన్న కథతో తెరకెక్కిస్తున్నాడా లేక సొంత కథతోనే తీస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. 

రీసెంట్ గా "హలో గురు ప్రేమకోసమే" చిత్రంతో పరాజయం పాలైన రామ్ ఈ చిత్రంతో మంచి విజయాన్ని సాధించాలనే కోరికతో ఉన్నాడు.. పూరి కూడా ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ రావాలని కోరుకుంటున్నాడు. ఈ ఏడాది ద్వితీయర్థంలో  వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: