సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ కాగా అల్లరి నరేష్ ఓ సర్ ప్రైజ్ రోల్ ప్లే చేశాడు.


ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆరు సాంగ్స్ జ్యూక్ బాక్స్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందా అందుకుంది. అయితే సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో మరో మోంటేజ్ సాంగ్ కూడా ఉందని సర్ ప్రైజ్ చేశాడు. అది జ్యూక్ బాక్స్ లో ఉంచలేదని సినిమా ఎమోషన్ తో పాటుగా ఆ సాంగ్ వస్తుందని అన్నారు.


దేవి మార్క్ మ్యూజిక్ తో ఆ సాంగ్ ఉంటుందని తప్పకుండా అభిమానులకు, ప్రేక్షకులకు ఆ సాంగ్ నచ్చుతుందని అంటున్నాడు. సినిమా జ్యూక్ బాక్స్ మొత్తం ఒకటైతే ఆ సాంగ్ ఒకటంటున్నాడు వంశీ పైడిపల్లి. మరి ఆ సాంగ్ లో అంత స్పెషల్ ఏముందో చూడాలి. మహ్రషి సినిమాలో మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించాడు.


ప్రపంచాన్ని ఏలేదామనుకుంటున్న రిషి జర్నీలో మనం కూడా భాగం అవ్వాలంటే మరో 6 రోజులు వెయిట్ చేయాల్సిందే. మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా వస్తున్న ఈ సినిమా సక్సెస్ లో కూడా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేలా ఉంటుందో లేదో చూడాలి. తప్పకుండా ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: