చిన్న సినిమాలతో కెరియర్ మొదలు పెట్టి స్టార్ ఛాన్సులు అందుకుని తెలుగు, తమిళ భాషల్లో అదరగొడుతున్న భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కెరియర్ మొదలు పెట్టి సౌత్ ఇండస్ట్రీకి రాగా మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది. రీసెంట్ గా దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించిన రకుల్ ఆ సినిమాలో అందాల ప్రదర్శనతో అదరగొట్టింది.


పాతికేళ్ల వయసు గల అమ్మడు వయసు ముదిరిన వ్యక్తి ప్రేమలో పడుతుంది. అయితే సడెన్ గా ఆ వ్యక్తి తన భార్య దగ్గరకు వెళ్లాల్సి రాగా ఈ యంగ్ లవర్ ను తీసుకెళ్తాడు. వారి కథ ఎలా నడించింది అన్నది దే దే ప్యార్ దే సినిమా కథ. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో రియల్ లైఫ్ లో ఎవరినైనా ప్రేమించారా అని రకుల్ ను అడిగితే అలాంటి వ్యక్తి ఇంకా తారస పడలేదని అన్నది.  


ఒకవేళ రియల్ లైఫ్ లో కూడా ఏజ్డ్ పర్సన్ ను ప్రేమించే ఛాన్స్ ఉందా అంటే తన మనసుకి నచ్చితే అసలు ఏజ్ తో సంబంధం లేదని.. తనకు నచ్చితే అతని ఏజ్డ్ ఆర్ యంగ్ అన్నది చూడనని తనకు ఎవరైనా ఓకే అంటుంది రకుల్. ఏజ్ ఫ్యాక్టర్ అటుంచితే మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు అంటుంది రకుల్. మొత్తానికి అమ్మడికి కూడా పెళ్లి వైపు గాలి మళ్లినట్టు ఉందై అంటున్నారు.


తమిళంలో ఎన్.జి.కే సినిమాలో నటించిన రకుల్ కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీ సీక్వల్ మన్మథుడు లో కూడా నటిస్తుంది. చిలసౌ డైరక్టర్ రాహుల్ రవింద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. చూస్తుంటే మళ్లీ రకుల్ తెలుగులో వరుస అవకాశాలు అందుకునేలా ఉంది. బాలీవుడ్ అవకాశం వచ్చినా వదిలేదు లేదంటుంది ఈ చిన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: