అమ్మో ఆమె పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. తన జోలికి వస్తే అస్సలు బాగోదు, సంగతి  తేలుస్తానని జబర్దస్త్  వార్నింగే ఇస్తోంది. మేము అంత చులకన అయిపోయామా అంటోంది. అర్ధాలు తెలిసి మాట్లాడండి, , ఇష్టం వచ్చినట్లుగా వాగి ఏవేవో  పేర్లు పెట్టేసి అవి మాకు చుట్టేస్తే  చూస్తూ వూరుకునేది లేదు అంటూ మండిపడుతోంది. ఇంతకీ ఆ అందాల భామకు అంత మంట పుట్టించిన రీజనేంటి అన్నది చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ మ్యాటరే ఉందిక్కడ.


ఆమె బాలివుడ్ భామ మలైకా అరోరా. తనదైన శైలిలో  డ్యాన్సుల్లో వెర్రెత్తించి  యూత్ ని కిర్రెక్కించే మ్యాజిక్ ఆమె సొంతం. దిల్‌ సే’ చిత్రంలోని ‘ఛయ్య ఛయ్యా..’తో ఆమెకు చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత హిందీలో ‘మున్నీ బద్నామ్‌’, తెలుగులో ‘కెవ్వు కేక’ లాంటి పాటలతో సూపర్ పాపులారిటీ సంపాదించింది మలైకా. ఆమెతో ఐటెం సాంగ్‌‌కు కోటి రూపాయల దాకా చెల్లించుకున్న నిర్మాతలున్నారు. నాలుగు పదుల వయసులోనూ ఆమెకు ప్రత్యేక గీతాల్లో నర్తించే అవకాశాలు వస్తూనే ఉన్నాయి.


ఇవన్నీ ఇలా ఉంటే మలైకా మాత్రం తనను ఐటెం గర్ల్, ఐటెం బాంబ్ అంటే పడేందుకు రెడీగా లేనని గట్టి కాషన్ ఇచ్చేసింది. తాను సినిమాల్లో చేసినవి ప్రత్యేక గీతాలని, వాటిని అలాగే పిలవాలని ఆమె కోరుతోంది. తాను చేసే పాటల్లో ఎంటువంటి అసభ్యత లెదని, మరి ఐటం గర్ల్ అంటూ చులకనగా మాట్లాడితే  వాళ్ళ పళ్ళు మొత్తం వూడగొడతానని హెచ్చరిస్తోంది. ఇది ఇండస్ట్రీలోనే కాదు. మీడియాకు పెద్ద వార్నింగే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: