తెలుగులో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు మహేష్ బాబు. చేసినవి పాతిక సినిమాలు అయినా మహేష్ కి ఉన్న ఫాలోయింగ్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. హిట్టూ ఫట్టుకు సంబంధం లేకుండా మహెష్ తన ఇమేజ్ ని సినిమా సినిమాకీ  పెంచుకుంటూ పోతున్నారు. లేటేస్ట్ గా మహేష్ నటించిన మూవీ మహర్షి నాలుగు రోజుల్లో రిలీజ్ అవుతోంది. మహేష్ అదిరిపోయే హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు.


ఇపుడు ఆ ముచ్చట్ల గురించి చెబుతూనే మహేష్ సరికొత్త న్యూస్ ని రివీల్ చేశాడు. మహర్షి తరువాత వెంటనే తాను అనిల్ రావిపూడి మూవీ చేస్తున్నట్లుగా ప్రకటించాడు మహేష్. జూన్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుందని ఫిక్స్ చేసేశాడు. ఆ తరువాత మూవీ ఏంటి అన్నది కూడా ఆయనే బయట పెట్టాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జక్కన్నతో మూవీ దగ్గర్లోనే  ఉంటుందని స్వీట్ న్యూస్ ఫ్యాన్స్ కి అందించాడు. మహేష్ రాజమౌళి మూవీ అంటేనే ఆ అంచనాలు బ్రహ్మాండంగా ఉంటాయి.


ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాత కేఎల్ లక్షినారాయణ నిర్మిస్తారని మహేష్ చెప్పడం ఫ్యాన్స్ కి సూపర్ డూపర్ న్యూస్. మహేష్ కి హాలీవుడ్ ఇమేజ్ ఉంది. జక్కన్న స్టైల్ కూడా అంతే. ఈ ఇద్దరి జోడీ అంటే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. సో మహేష్ రాజమౌళి ఎపుడెపుడా అని ఎదురుచూడడమే ఈ రోజు నుంచి ఫ్యాన్స్ పని.  ఇక  ఇంకో న్యూస్ కూడా మహేష్ చెప్పాడు, మంచి కధ ఉంటే రాం చరణ్, తారక్ తో కూడా నటిస్తానని, మొత్తానికి మహేష్ ఫ్యూచర్ పాజెక్టులు  అన్నీ కూడా  వెరీ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: