వెండి తెర మీద కనిపించాలంటే ఎన్నో చేయాలి. అవకాశాలు రావడం కోసం ప్రమోషన్లు ఎన్నో ఉంటాయి. అయినా లక్కు అనేది ఒకటి ఉంటుంది. అది కలసిరాకపొతే బ్యాక్ సీట్లోనే ఉంటారు. నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నా రిజల్ట్ జీరోనే. అందరూ హీరోలు, హీరోయిన్లు అవడానికే చూస్తారు. మరి చాన్సులు వస్తాయా. అంతవరకూ వెయిట్ చేసేసరికి ఫేడౌట్ ఐపోతారు.


మరి ఈ గ్యాప్ లో  ఏం చేయాలంటే వచ్చిన పాత్రను ఒప్పుకోవాలి. అందుకే హాట్ బ్యూటీ ఆదాశర్మ ఇపుడు ఆ పనిలోనే ఉంది. ఆమె కెరీర్ ప్రస్తుతం చాలా నిరుత్సహకంగా నడుస్తుంది. తెలుగులో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదాకు చెప్పగోదగ్గ సినిమా ఆఫర్స్ రాలేవు. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కానీ తనకి అదృష్టం కలిసి రావట్లేదు.సీనియర్ హీరో రాజశేఖర్‌కు జోడీగా నటిస్తోందంటే ఆదా కెరీర్ ఎలా సాగుతోందో అంచనా వేయొచ్చు. తెలుగుతో పాటు వేరే భాషల్లోనూ ఆదాకు చెప్పుకోదగ్గ ఛాన్సులేమీ లేవు. ఇలాంటి తరుణంలో ఒక సంచలన పాత్ర చేయడానికి ఆమె ఓకే చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.


‘మ్యాన్ టు మ్యాన్’ పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆదాశర్మ  హిజ్రా పాత్ర పోషిస్తోందట.మామూలుగా సినిమాల్లో హిజ్రా పాత్ర అంటే.. మగాళ్లే ఆ వేషం వేసుకుంటుంటారు. లేదంటే రియల్  హిజ్రాల్ని పెడతుంటారు. అలా కాకుండా అమ్మాయిలు హిజ్రాలుగా నటించడం అన్నది దాదాపు లేదనే చెప్పాలి. మరి ఇలాంటి పాత్ర చేయడానికి ఆదా లాంటి కథానాయికగా ముందుకు రావడం షాకింగ్ న్యూసే. 
ఆమెను ఆ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఈ సినిమాలో ఆదా మగాడిగా కూడా కనిపిస్తుందని అంటున్నారు. ఇలాంటి పాత్రలు చేస్తే ఆదాశర్మ కి హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి. మొత్తానికి ఈ హాట్ బ్యూటీ రంగు పూసుకునేందుకు  ఎన్ని పాట్లు  పడుతోందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: