యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా ముందు వరకు తెలుగు స్టార్ హీరోనే కాని బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు అతను నేషనల్ స్టార్ గా ఎదిగాడు. అందుకే ప్రభాస్ సాహో సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేసేలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సాహో సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. 


సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెలుగు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం ఖాయమని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ కూడా భారీ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఆ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల పైనే అంటున్నారు. యువి క్రియేషన్స్ ఆ సినిమాను నిర్మిస్తున్నారట.


అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగినా ప్రతి సినిమా భారీ బడ్జెట్ అంటే కష్టం. సినిమా బడ్జెట్ ఎంతైనా పెట్టొచ్చు కాని అవి మళ్లీ కలక్షన్స్ రూపంలో రాబట్టాలన్నా, బిజినెస్ చేయాలన్నా కష్టమే. సాహో ఆ తర్వాత వచ్చే సినిమాలు రెండు యువి క్రియేషన్స్ వాళ్లవే కాబట్టి వర్క్ అవుట్ అవుతున్నాయి. అయితే రాధాకృష్ణ తర్వాత సినిమా మాత్రం ప్రభాస్ 50 నుండి 70 కోట్ల బడ్జెట్ తీస్తే మంచిది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే సాహో ఆ తర్వాత వచ్చే సినిమాలు రెండు తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అంత బడ్జెట్ పెడుతున్నారట.


వాటిల్లో ఏ ఒక్కటి హిట్టైనా మళ్లీ అలాంటి బడ్జెట్ తోనే ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ప్రభాస్ తన ప్రతి సినిమాను నేషనల్ లెవల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. బాహుబలితో అతనికి వచ్చిన క్రేజ్ తో అది అంత పెద్ద కష్టమేమి కాదు. సాహో కూడా నేషనల్ వైడ్ గా రికార్డులు సృష్టిస్తే ఇక ప్రభాస్ ను ఆపడం మాత్రం కష్టం. 


మరింత సమాచారం తెలుసుకోండి: