ఆ మద్య వెంకటేష్ నటించిన ‘గురు’సినిమాలో హీరోయిన్ గా నటించిన రితికా సింగ్ క్రీడా నేపథ్యం నుంచి వచ్చింది.‘ఇరుదిసుట్రు’ సినిమా ద్వారా తమిళతంబీలను ఆకట్టుకున్న నటి రితికా సింగ్‌. లారెన్స్‌తో ‘శివలింగ’, ‘ఆండవన్‌ కట్టలై’ వంటి పలు సినిమాల్లో నటించింది.  ఆ తర్వాత రితికా హాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది.  తెలుగు, తమిళ భాషల్లో మంచి ఛాన్సులు వస్తున్న సమయంలో రితికా అనుకోకుండా కనిపించకుండా పోయింది. 

అయితే ఆమె ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  తమిళంలో ఆమె నటించిన ‘వనంగాముడి’ విడుదలకు నోచుకోకుండా ఆలస్యమవుతోంది. ఒకట్రెండు చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.  మొదటి సినిమా  నుంచి ఇప్పటి వరకు నటనకు, ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చిందీ ముద్దుగుమ్మ. కాకపోతే సక్సెస్ అందుకోలేక పోవడంతో.. ఇప్పుడు అందాలు ఆరబోసే పాత్రలకు కూడా సై అంటోంది. 

తాజాగా ఆమె గ్లామర్‌గా తీసుకున్న ఫొటో షూట్‌ చిత్రాలను కూడా పోస్ట్‌ చేసింది. అవకాశాలు సన్నిగిల్లినందువల్లే ఆమె గ్లామర్‌గా కనిపించడానికి అంగీకరించేందుకు సిద్ధమైందని కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.    ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: