సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి 3 ఏళ్లు ఈ సినిమా కోసం వెయిట్ చేశాడని మహర్షి ఈవెంట్ లో మహేష్ అన్నాడు. ఇక ఈ సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా అవడం కూడా మరో విశేషంగా చెప్పొచ్చు. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా హిట్ పై ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.


ఈ సినిమా పక్కా హిట్ అని చెప్పేందుకు కొన్ని అంశాలు ప్రస్తావిస్తే.. స్టార్ సినిమాకు కావాల్సిన హంగామా అట్టహాసం ఇందులో ఉన్నాయి. మాస్ అండ్ క్లాస్ అని తేడా లేకుండా సినిమా ఉంటుంది. అంతేకాదు ఓ స్ట్రాంగ్ కంటెంట్ తో మహర్షి సినిమా వస్తుందని చెప్పొచ్చు. అందుకే సినిమా యూనిట్ అంతా మహర్షి రిజల్ట్ పై ధీమాగా ఉన్నారు. అంతేకాదు మహేష్ 3 వేరియేషన్స్ లో నటిస్తున్నాడు.


మహేష్ ఫోటో చూపిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ కు 3 డిఫరెంట్ వేరియేషన్స్ లో క్యారకరైజేషన్ డిజైన్ చేయడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ అదిరిపోతుందని అంటున్నారు. సినిమా చూసి వచ్చే ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు ఆలోచించుకునే విధంగా మహర్షి ఉంటుందట. అందుకే సినిమా పక్కా హిట్ అని చెప్పుకుంటున్నారు.


సినిమాకు దేవి మ్యూజిక్ తో పాటుగా పూజా హెగ్దె అందాలు.. అల్లరి నరేష్ రోల్ కూడా చాలా గొప్పగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. మే 9న మహేష్ ఫ్యాన్స్ కు స్పెషల్ ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టే. ఇప్పటికే రిలీజ్ హంగమా మొదలవగా ఆన్ లైన్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: