చిరంజీవి మెనల్లుళ్ల యుగం ఇది. ఓ మేనల్లుడు ఈ మధ్యనే సాయి తేజ్ గా పేరు మార్చుకుని చిత్రలహరితో లేటెస్ట్ హిట్ కొట్టాదు. మంచి ఈజ్ ఉన్న సాయి తేజ్ మెగా వారసునిగా నిలబడే అవకాశాలే ఉన్నాయని అంతా అంటున్న సంగతి విధితమే. ఇపుడు ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా సినిమా రంగానికి పరిచయం అవుతున్నాడు. తాను కూడా ఎక్కడా అన్నకు తీసిపోనని నిరూపించుకుంటున్నాడు.


వైష్ణవ్ తేజ్ సినిమాను  సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదకు వచ్చింది. 


జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా ఉప్పెన పవర్ ఫుల్ టైటిల్ కావడంతో మంచి మాస్ మసాలాతోనే చిన్న మేనల్లుడు రంగంలోకి వస్తున్నట్లుగా అర్ధమవుతోంది.


కొన్ని దశాబ్దాల క్రితం రెబ‌ల్ స్టార్ క్రిష్ణం రాజు హీరోగా నాకూ స్వాతంత్రం వచ్చింది సినిమా జాలర్ల కధతోనే తీసారు. అది మంచి హిట్ కొట్టింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అలా పూర్తిగా జాలర్ల కధతో సినిమా తీయడం ఈనాటి తరానికి కొత్త అనుభవమే. ఈ సినిమా కధ బట్టి చూస్తే మంచి అంచనాలే ఉన్నాయి. చూడాలి చిన్నల్లుడు ఎలా విరగదీస్తోడో.


మరింత సమాచారం తెలుసుకోండి: