మహర్షి మూవీ ప్రమోషన్ సందర్భంగా మహేష్ ఆసక్తి కరమైన విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు. అయితే ఈ సినిమా సంగతుల కంటే, తన 25 సినిమాల కెరీర్ జర్నీ విశేషాల్నే మీడియాకు ఎక్కువగా చెప్పాల్సి వస్తోంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నుంచే తన పాతిక సినిమాల జర్నీ గురించి మాట్లాడుతున్న మహేష్, తాజాగా తన తొలి సినిమా అనుభవాల్ని మరోసారి పంచుకున్నాడు. ఆ టైమ్ లో రాఘవేంద్రరావు తనను తిట్టిన ఓ ఘటనను గుర్తుచేసుకున్నాడు.


"రాజకుమారుడు నెరేషన్ జరుగుతోంది. పరుచూరి బ్రదర్స్ వచ్చి స్టోరీ చెబుతున్నారు. రాఘవేంద్రరావు గారి టేబుల్ పైన రబ్బర్ బ్యాండ్ ఒకటుంది. కథ వింటూ ఆ రబ్బర్ బ్యాండ్ తో ఆడుకుంటున్నాను నేను. మొత్తం నెరేషన్ అయిన తర్వాత పరుచూరి బ్రదర్స్ వెళ్లిపోయారు. అప్పుడు రాఘవేంద్రరావు అందుకున్నారు. కథ నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు బిహేవ్ చేయాలని, రబ్బర్ బ్యాండ్ తో ఆడుకుంటే దర్శకుల కాన్ఫిడెన్స్ పోతుందని, భవిష్యత్తులో ఇలా చేయకని క్లాస్ పీకారు."


ఆ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటున్నాడు మహేష్. అప్పటికే బాలనటుడిగా కాస్త అనుభవం ఉన్నప్పటికీ హీరోగా ఎంట్రీ అనేసరికి చాలా ఇబ్బందిపడ్డానని, రాఘవేంద్రరావు ఓ స్నేహితుడిలా తనకు అన్నీ నేర్పించారని.. చివరికి ఎలా నిలబడాలి, కూర్చోవాలి లాంటి అంశాల్ని కూడా నేర్పించారని గుర్తుచేసుకున్నాడు. ఓ నటుడిగా తొలిసారిగా మురారి సినిమాతో కనెక్ట్ అయ్యానని అన్నాడు మహేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: