తేజస్వి .. బిగ్ బాస్ 2 లో సందడి చేసి అభిమానులు చేరువయ్యింది. తాను చేసిన స్పైసీ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రం నుంచి  కెరీర్ పరంగా పోరాటం సాగిస్తూనే ఉంది ఈ అమ్మడు. ఆర్జీవీ తనని హీరోయిన్ గా పరిచయం చేసినా వరుసగా ఫ్లాప్ సినిమాలు కెరీర్ కి ఇబ్బందికరంగానే మారాయి. దాంతో ఈ రెండేళ్లలో సరైన ఆఫర్ తగల్లేదు.


అయినా మోడలింగ్ అసైన్ మెంట్స్ సహా రకరకాల వ్యవహారికాలతో నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది.  సోషల్ మీడియా ట్రెండ్ లో తేజస్వి లాంటి తెలుగమ్మాయిలకు .. ఔత్సాహిక నటీమణులకు ఏదో ఒక మూల ఏదో ఒక అవకాశం రాకుండా ఉంటుందా? ఆ ఛాన్స్ కోసమే ఆత్రంగా వేచి చూస్తోంది.  ఆ క్రమంలోనే తనలోని గ్లామర్ యాంగిల్ ని ఇన్ స్టాలో ప్రదర్శిస్తూ దర్శకనిర్మాతలకు ఫీలర్స్ ని పంపుతోంది.


గత కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రమ్ లో తేజస్వి పోస్ట్ చేస్తున్న ఫోటోషూట్లు యూత్ లో హీట్ పెంచుతున్నాయి. ఎవ్వర్ లేటెస్ట్ బికినీ పిక్ జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది. ఈ ఫోజులో తేజస్వి బాత్ టబ్ లో ఎంతో విరహంతో కనిపిస్తోంది. బ్లాక్ & వైట్ కాంబినేషన్ ఫ్లోరల్ బికినీలో తేజస్వి కవ్వింత గుండెల్ని టచ్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: