మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయిక అంటే ఖచ్చితంగా అది గుర్తు కాంబినేషనే అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు కామెంట్ చేస్తుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు ఖలేజా సినిమాలకు ఇప్పటికికూడా టెలివిజన్లో బీభత్సమైన టి ఆర్ పి రేట్లు పలుకుతుంటాయి. ముఖ్యంగా అతడు సినిమా తో మహేష్ బాబు లో ఉన్న సైలెన్స్ క్యారెక్టర్ని బయటకు తీసిన త్రివిక్రమ్ ఖలేజా సినిమా తో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ ని బయటకు తీయడం జరిగింది అని చాలామంది మహేష్ అభిమానులు పేర్కొంటుంటారు.

Image result for trivikram MAHESH BABU

ముఖ్యంగా మహేష్ సినిమాలో ‘ఖలేజా’ సినిమా అనేది ఒక మైలురాయి సినిమా వంటిదని పెద్దగా విజయం సాధించకపోయినా గాని మహేష్ లో ఉన్న కొంటె నటుడిని ఈ సినిమా బయటకు తీసుకు వచ్చిందని చాలామంది మహేష్ సన్నిహితులు అంటుంటారు. అయితే వీరిద్దరి కలయికలో ప్రస్తుతం మూడో సినిమా ఎప్పుడొస్తుందోనని అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Image result for trivikram MAHESH BABU

ఈ క్రమంలో ఇటీవల త్రివిక్రమ్ మహేష్ తో మూడో సినిమా చేయడానికి భారీగా ప్లాన్ వేసినట్లు..దాదాపు భారీ బడ్జెట్ తో తెరకెక్కేటట్లు ఉన్నా స్టోరీ ని త్రివిక్రం శ్రీనివాస్ మహేష్ కి చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా తో చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే మహేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. మరో పక్క మహేష్ బాబు కూడా అనిల్ రావిపూడి సినిమా అవగానే త్రివిక్రమ్ తో పని చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: