టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కి మంచి క్రేజ్ ఉంది. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయ నాయకుడిగా బిజీబిజీగా గడిపే బాలయ్య అభిమానులకు అప్పుడప్పుడు తన తరహాలో షాక్ లు ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా మాత్రం ఒక అభిమాని తనకు బాలయ్య పై ఉన్న అభిమానాన్ని వింతగా చాటుకుని అందరికి షాక్ ఇచ్చాడు.

.Image result for BALAKRISHNA

మామూలుగా అభిమానులు అయితే సదరు హీరో సినిమాలకు ఫ్లెక్సీలు కట్టడం పాలాభిషేకాలు చేయటం ..మరికొంతమంది హీరో పేరిట రక్తదానాలు చేయడం ఇంకా అభిమానం ఎక్కువ అయితే తమ పిల్లలకు సదరు హీరో చేత పేరు పట్టించుకోవడం ఇలా రకరకాలుగా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కర్ణాటకకు చెందిన బాలకృష్ణ అభిమాని శ్రీనివాసులు బాలయ్య పై తనకి ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. శ్రీనివాసులు ఏకంగా తన కుమారుడి పెళ్లి పత్రికపై బాలయ్య ఫోటోలతో ముద్రించాడు.


నందమూరి అభిమానులందరూ.. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పలికాడు. మే 13న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై.. తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని కోరాడు. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి...మా ఆరాధ్య దైవం బాలయ్య బాబు అంటూ పత్రికపై ముద్రించాడు. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలా మంది నెటిజన్లు బాలకృష్ణ అభిమానుల మజాకా అని కామెంట్లు చేస్తున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: