ఐపియల్ సీజన్ ఇప్పుడు మంచి జోరు  ఉంది. ఇక ప్రతి ఏడాది హాట్ ఫేవరేట్ గా ఉండే చెన్నై జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఇక చెన్నై టీంలో ముఖ్య పాత్ర పోషించే వెస్ట్ ఇండీస్ ఆటగాడు బ్రేవో గురించి అందరికి తెలిసిందే. తన అలిరౌండ్ ప్రదర్శనతో ఇటు బౌలర్ గా అటు బ్యాట్సమన్ గా బ్రేవో టీంలో  ముఖ్య పోషిస్తాడు. 

ఇక 12ఏళ్లుగా చెన్నై టీంకి ఆడుతున్న బ్రేవోకి చెన్నై సంస్కృతులు, అక్కడి వంటకాలు, అభిరుచులు బాగా నచ్చాయట..వీటితో పాటు తమిళ ప్రేక్షకులు తనపై చూపించే అభిమానం మాటల్లో చెప్పలేనిది అన్నాడు బ్రేవో. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాలు చెప్పుకొచ్చిన బ్రేవో తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ ని చూడాలని ఎంతగానో ఉందని తెలిపాడు. "ఇక్కడి ప్రజలు రజని సర్ ని అభిమానించే తీరు నాకెంతో నచ్చింది ఒక హీరోని ఇంతలా అభిమానించడం ఎక్కడ చూడలేదు, ఇందరి అభిమానాన్ని చొరగొన్న రజనీకాంత్ గారిని చూడాలని ఉంది" అని తెలిపాడు. 

ఇక రజని సినిమాలేవీ తాను చూసే అవకాశం దొరకలేదని, తీరిక దొరకగానే తప్పకుండ చూస్తానని చెప్పుకొచ్చాడు బ్రేవో. ఇక తన ఆట తీరుతోనే కాక తమ అభిమాన హీరోని సైతం గౌరవిస్తున్న బ్రేవో అంటే మరింత అభిమానం పెరిగిందని చెప్తున్నారు తమిళ తంబీలు 
 


మరింత సమాచారం తెలుసుకోండి: