బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ వల్ల తన తండ్రికి కాన్సర్ వచ్చిందంటున్నాడు.రాజస్థాన్ కి చెందిన దినేష్. వివరాల్లోకి వెళ్తే జైపూర్ కి చెందిన  చిరు వ్యాపారస్తుడు నానక్ రామ్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కి వీరాభిమాని. అజయ్ సినిమాలన్నా,  నటనన్నా విపరీతంగా ఆదరించేవాడు. 

ప్రతి విషయంలో అజయ్ దేవగన్ ని అమితంగా అనుసరించే నానక్ రామ్..అజయ్‌ ప్రచారకర్తగా వ్యవహరించే టొబాకో ఉత్పత్తులనే వాడారట. దాంతో కొంతకాలానికి అతనికి క్యాన్సర్‌ వచ్చింది, ప్రస్తుతం ఆరోగ్యం బాగా క్షిణించడంతో అయోమయంలో ఉందిట వాళ్ళ కుటుంబం. దీనీపై  నానక్ రామ్ కుమారుడు దినేష్ మాట్లాడుతూ

"మా నాన్న అజయ్‌ దేవగణ్‌కు వీరాభిమాని. కానీ ఆ ఉత్పత్తులను వాడటం వల్ల నాన్నకు క్యాన్సర్‌ వచ్చింది" అని వాపోయాడు. 
ఇదే కాకుండా తన తండ్రిలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని  ఓ కాగితంపై రాసి దాదాపు వెయ్యి కరపత్రాలను ప్రచురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని ప్రాంతాల్లో అంటించాడట. దీంతో కొంతమందిలో అయినా మార్పు వస్తుందని ఆశపడుతున్నాడు దినేష్. ఇక ఈ సంఘటన పై అజయ్ దేవగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: