నాచురల్ స్టార్ నాని హీరోగా ఈమధ్యనే వచ్చిన జెర్సీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లు సోసోగానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా హిట్ అనిపించుకున్నా టాక్ కు తగినట్టుగా వసూళ్లు మాత్రం రాబట్టలేదని చెప్పొచ్చు. ఇక నాని ప్రస్తుతం విక్రం కుమార్ డైరక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తునాడు. ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు.


ఈ రెండు ఒకేసారి సెట్స్ మీద ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు నాని. టాలీవుడ్ కు మల్టీస్టారర్ ట్రెండ్ మళ్లీ గుర్తుచేసిన శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మంచి సినిమా చేసినా ఆ తర్వాత బ్రహ్మోత్సవం అనే డిజాస్టర్ సినిమా తీసి బ్యాడ్ నేం తెచ్చుకున్నాడు. ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల మరో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 


ఈసారి నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ అడ్డాల సినిమా ఉంటుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తారట. ఆల్రెడీ నానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే భలే భలే మగాడివోయ్ సినిమా సూపర్ హిట్ దక్కింది. ఆ హిట్ సెంటిమెంట్ తో అయినా శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్ట్ కు మంచి హైప్ వస్తుంది. అదీకాకుండా నాని జెర్సీ సినిమాతో మళ్లీ ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ తీసిన రెండు సినిమాలు నిరాశపరచగా ఈ ఇయర్ జర్సీతో హిట్ ఖాతా తెరిశాడు.


విక్రం కుమార్ తో తీస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా కూడా కొత్తగా ఉంటుందట. ఇక ఈ సినిమా తర్వాత వి అయితే నాని నెగటివ్ రోల్ లో ఇప్పటివరకు మనం చూడని కొత్త నానిని చూపిస్తారట. మొత్తానికి నాని కెరియర్ లో మంచి స్కోప్ ఉన్న సినిమాలను చేస్తూ అలరిస్తున్నాడు. జెర్సీలో నాని నటనకు అందరు ఫిదా అవగా రానున్న సినిమాల్లో ఇంకా సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు నాని.  



మరింత సమాచారం తెలుసుకోండి: