ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో టాటూస్ వేయించుకోవడం ఫ్యాషన్ అయ్యింది.  అయితే ఈ టాటూస్ సినిమా వాల్లే కాదు సెలబ్రెటీ హోదా ఉన్నవారు..లేని వారు కూడా వేయించుకుంటున్నారు. కాకపోతే సిని సెలబ్రెటీలు ఈ టాటూస్ వేయించుకోవడంలో ఏదో ఒక అర్థం ఉంటుంది.  తాజాగా రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాధికా ఆప్టే తరువాత బాలకృష్ణతో లెజెండ్, డిక్టెటర్ సినిమాల్లో నటించింది.  సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి’సినిమాలో నటించింది.  ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.


రాధికా ఆప్టే సినిమాల్లో కన్నా తన కాంట్రవర్సీ మాటలతో బాగా పాపులర్ అయ్యింది.  అప్పట్లో టాలీవుడ్ లో హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుందని.. హీరోయిన్లను డమ్మిగా చూపిస్తారని సంచనల వ్యాఖ్యలు చేసింది.  ఈ మద్య ఒక ఈవెంట్ కు స్టైలిష్ డిజైనర్ డ్రెస్ ధరించి హాజరయింది. థై స్లిట్ గౌన్ కావడంతో ఆమె తొడపై పొడిపించుకున్న చిన్నపాటి పచ్చబొట్టు కెమెరాల కంటికి చిక్కింది.   ఆ సమయంలో ఈ పచ్చబొట్టు ఫోటోలు బైటకు వచ్చినప్పటికీ వాటిలో తన పచ్చబొట్టు క్లియర్ గా కనిపించలేదు.  


తాజాగా ఆమె పచ్చబొట్టు క్లియర్ గా కనిపిస్తున్న ఫోటోలో మీడియాలోకి వచ్చేశాయి. ఆప్టే తన ప్రియమైన భర్తగారు బెనెడిక్ట్ టేలర్ ఇనిషియల్స్ 'B' ను తన తొడపై టాట్టూ వేయించుకుంది. బ్రిటన్ లో ఆయన ఒక పాపులర్ మ్యుజిషియన్.  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన 'ది హంగ్రీ'.. 'ఘౌల్' లాంటి వెబ్ సీరీస్ లకు సంగీతం అందించాడు. రాధిక.. బెనెడిక్ట్ టేలర్ ల వివాహం 2012 లో జరిగింది. మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: