మహేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. ఫెయిల్యూర్స్ పుణ్యమానని బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకోవటం లేదు. తన దగ్గరకి వచ్చే దర్శకులకి మహేష్‌ ఈజీ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఒక పెద్ద గోడ కట్టేసి, దానిని దూకి వచ్చిన వారికే సినిమా అంటున్నాడు. ఏ దర్శకుడికి అయినా తననుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించాలంటే బౌండ్‌ స్క్రిప్ట్‌ మస్ట్‌ అంటున్నాడు. కానీ సీనియర్‌ దర్శకులు, పేరున్న దర్శకులు అలా బౌండ్‌ స్క్రిప్టులు రాయడానికి ఇష్టపడరు.


త్రివిక్రమ్‌, సుకుమార్‌ లాంటి దర్శకులు స్పాట్‌ ఇంప్రూవ్‌మెంట్స్‌ చేస్తామంటారు తప్ప ముందుగా స్క్రిప్ట్‌ లాక్‌ చేయడం వారి స్టయిల్‌ కాదు. కానీ పెద్ద దర్శకుల చేతిలోను భంగపడ్డ మహేష్‌ ఇప్పుడు ఛాన్స్‌ తీసుకోవడం లేదు. దీంతో యువ దర్శకుల వద్ద మాత్రమే మహేష్‌ కోరుకుంటోన్న బౌండ్‌ స్క్రిప్టులు దొరుకుతుండగా, స్టార్‌ దర్శకులు మాత్రం మహేష్‌ కట్టిన సరిహద్దు గోడ దాటలేకపోతున్నారు.


 సుకుమార్‌తో అయినా, త్రివిక్రమ్‌తో అయినా మళ్లీ చేయడానికి సిద్ధమే అంటోన్న మహేష్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌తో వచ్చి మెప్పించమని కండిషన్‌ పెట్టాడు. లేదంటే యువ దర్శకులతో తక్కువ బడ్జెట్‌లో చేసుకుని తన పారితోషికంగా ఎక్కువ డబ్బు తీసుకోవడం ఉత్తమమని మహేష్‌ భావిస్తున్నాడు. స్టార్‌ దర్శకులు మహేష్‌ మీద ఆశలు వదిలేసుకుంటూ వుండగా, యువ దర్శకులు మాత్రం ఇప్పుడు మహేష్‌తో అవకాశం రావడం ఈజీ అనే భావనలో అతనికోసం కథలు రాసే పనిలో పడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: