రకుల్ ప్రీతీ సింగ్ ఆ మధ్య వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. అయితే తరువాత వరుసగా ఫెయిల్యూర్స్ పలకరికంచడంతో జోరు తగ్గింది. అయితే  హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన 'దే దే ప్యార్ దే' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  తమిళంలో సుర్య కొత్త సినిమా 'NGK' కూడా రిలీజ్ కు రెడీ.  తెలుగులో 'మన్మథుడు 2' లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 


తన బుట్టలో క్రేజీ ప్రాజెక్టులు లేవని ఫీలయిందేమో కానీ కొన్ని రోజులుగా ఫోటోషూట్ల దుమ్ము దులుపుతోంది.  రోజు మార్చి రోజు కాదు.. పూటకో ఫోటో షూట్ చేయడం ఆ ఫోటోలను ఎత్తి.. ఇన్స్టాలో పడేయడం.. తాపీగా 'దే దే ప్యార్ దే' ప్రమోషన్స్ చేసుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నట్టుంది.  తాజాగా మరో ఫోటో షూట్ చేసింది.  ఈ డ్రెస్ కూడా 'దే దే ప్యార్ దే' ప్రమోషన్స్ కోసం వేసుకున్నదే అని తెలిపింది. నిలువు స్ట్రైప్స్ ఉన్న బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుంది.. దానికి కాంట్రాస్ట్ కలర్ వైట్ ప్యాంట్ వేసుకొని ఫోటోలకు పోజిచ్చింది.


పోనీ టెయిల్..  పర్ఫెక్ట్ మేకప్ తో.. యాక్సెసరీస్ ఏవీ లేకుండా ఒక సూపర్ మోడల్ లాగా కనిపిస్తోంది.  అందాల ప్రదర్శన షరా మామూలే!ఇక చూసుకోండి.. నెటిజనులు రెచ్చిపోయారు. జస్ట్ 24 గంటలు కూడా కాకుండానే ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అదిరిపోయిందని ఒకరు.. రాకుల్ ఈజ్ ఆల్వేస్ కూల్ అని మరొకరు.. పొగడ్తలు కురిపించారు. ఒక నెటిజనుడు మాత్రం మెడలో ఒక పెండెంట్ లాంటిది పెట్టుకుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: