దిశా పటాని గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. అందాలను ఆరబోయటంలో ఆమెది సెపరేట్ స్టయిల్. అప్పట్లో ఈ భామ ఏదో ఒక బ్రాండ్ ఇన్నర్ వేర్ ధరించి బీచ్ లో అందాలు ఆరబోస్తూ 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ' అంటూ తన నేటివిటీకి తగ్గట్టు హిందీలో పాటేసుకుంటూ ఉండేది. అయితే ఈ భామ అందాలు.. షార్ప్ నెస్ ను కాల్విన్ క్లెయిన్ వారు గమనించారు. అంతే వారికి "లడ్డూ కావాలా బాబూ..." అన్నట్టుగా అనిపించిందేమో కానీ మాంఛి రెమ్యూనరేషన్ ఇచ్చి బ్రాండ్ అంబాజిడర్ గా పెట్టుకున్నారు.


ఇక చూడాలి. ఊరికే వదిలేస్తేనే 'ఆరేసుకోబోయి..' అంటూ పాట పాడే పతానికి రేమ్యూనషన్ ఇచ్చి మరీ పాట పాడమంటే ఊరుకుంటుందా? సోషల్ మీడియాను బంతిలా గా చేసి ఆడుకుంటోంది. తాజాగా మారోసారి అదే బ్రాండ్ ఇన్నర్ వేర్లు ధరించి.. అంతః సౌందర్యాన్ని ఆరబోసింది.  దిశా రెండు ఫోటోలు పోస్ట్ చేసి "లెఫ్ట్ కు స్వైప్ చేయడం మర్చిపోకండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే రెండో ఫోటో ఉంది దాన్ని కూడా చూడండి అని అంతరార్థం.


 ఇక చూసుకోవాలి.. ఇన్స్టాగ్రామ్ లో నెటిజనులు వెర్రెత్తిపోయారు .. జస్ట్ ఐదు గంటల్లోనే  1.1  మిలియన్ కు పైగా లైక్స్ కొట్టారు. ఇక కామెంట్ల కౌంట్ కూడా భారీగానే ఉంది.. 11.1 వేలకు పైగా కామెంట్లు.  ఒకరు "నా హృదయంలో అగ్ని రగిలించావు" అన్నాడు. ఇంకొకరు "అసలే ఎండ వేడికి చస్తున్నాం.. ఆపై నీ గోల ఒకటి" అంటూ ప్రేమగా కసురుకున్నారు. ఒకరు దిశా క్యాప్షన్ కు "పిచ్చోడు అయితే తప్ప లెఫ్ట్ కు స్వైప్ చెయ్యకుండా ఉండడు" అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేగా... అంతేగా...!

మరింత సమాచారం తెలుసుకోండి: