మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్, సునీల్ రూమ్మెట్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇద్దరు ఒకే రూంలో ఉంటూ సినిమా ప్రత్నాలు మొదలు పెట్టారు. అయితే కొంత కాలానికి త్రివిక్రం డైలాగ్ రైటర్ గా.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే తన మిత్రుడికి తను రాసిన సినిమాలలో మంచి పాత్రలు క్రియోట్ చేసి నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి ఎంతో దోహదపడ్డాడు. 


ఒక రకంగా చెప్పాలంటే త్రివిక్రం..సునీల్ ను బాధ్యతగా తీసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే సునీల్ లేకుండా సినిమా ఉండేది కాదు..ఒక కమెడియన్ గా అంతటి క్రేజ్ వచ్చేలా చేశాడు. అంతేకాదు "మెగాస్టార్" చిరంజీవి సైతం సునీల్ ఉంటే బావుంటుందనే స్థాయికి సునీల్ కూడా చేరుకున్నాడు. అంతేకాదు రాను రాను సునీల్ కామెడి హీరోగా పాపులర్ అయి తన స్నేహితుడు త్రివిక్రం కి కూడా డేట్స్ సర్దుబాటు చేయలేని రేంజ్ కి వెల్లిపోయాడు. అదే సమయంలో సునీల్ తో "బంతి" అనే సినిమా తీయాలనుకున్నట్లు ఒక సందర్భంలో చెప్పిన మాట అందరికి తెలిసిందే. ఆ తర్వాత అటు త్రివిక్రం, ఇటు సునీల్ ఫుల్ బిజీ కావడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక త్రివిక్రం మాత్రం కంటిన్యూస్ గా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్.టీ.ఆర్ లతో వరుస బెట్టి సినిమాలు తీస్తున్నాడు. కానీ సునీల్ మాత్రం గత కొంత కాలంగా తను హీరోగా తీసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతు సతమతమవుతున్నాడు. 


ఇది గమనించిన త్రివిక్రం తన స్నేహితుడి కోసం మళ్ళీ తన సినిమాలలో క్యారెక్టర్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడు కానీ సునీల్ ని సోలో హీరోగా పెట్టి సినిమా తీయలేకపోతున్నాడు. రాజమౌళి సైతం సునీల్ తో "మర్యాద రామన్న" సినిమా తీసి హిట్టిచ్చాడు. అంతేకాదు రాజమౌళి కెరీర్ లో తను డైరెక్ట్ చేసిన బెస్ట్ సినిమా "మర్యాద రామన్న" అని చెప్పడం కూడా విశేషం. రాజమౌళి తనకు హిట్టివగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రివిక్రం తనతో తీయాలనుకున్న "బంతి" సినిమా తీసి హిట్టివ్వలేడా...! అనే సందేహం సునీల్ మనసులో లేకపోలేదు. చూడాలి మరి త్రివిక్రం సునీల్ బాధను ఎప్పటికి అర్థం చేసుకుంటారో... 


మరింత సమాచారం తెలుసుకోండి: